ఘనంగా ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమం

ఏర్గట్ల, బతుకమ్మ :   తాళ్ల రాంపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ఆయన పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, గృహ ప్రవేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని భానుచందర్, కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్...