30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందల్వాయిలో వనదేవతలకు బోనాల సమర్పణ

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలోని చంద్రాయన్ పల్లి, గన్నారం, తీర్మాన్ పల్లి, మల్లాపూర్, గౌరారం, డోన్కల్ గ్రామాలలో ఆదివారం గ్రామంలోని వన దేవతలకు బోనాలను సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఈ సందర్భంగా వనదేవతలను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్ లు ప్రార్థించారు. వనదేవతల మొక్కులను తీర్చుకున్నటువంటి గ్రామ కమిటీ సభ్యులు వన భోజనాలకు కుటుంబ సమేతంగా తరలి వెళ్లారు. ఆదివారం పోచమ్మ పండుగ సందర్భంగా గ్రామంలో ప్రతి ఒక్కరు వనదేవతల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే కట్ట మైసమ్మకు సైతం బలి ఇస్తామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లోకని గంగమని గంగారం, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, తీర్మాన్ పల్లి గ్రామ సర్పంచ్ చింతల కిషన్, ఉప సర్పంచ్ రవి, గన్నారం సర్పంచ్ కరణం సుజాత శ్రీనివాస్, చంద్రన్న పల్లి సర్పంచ్ ఆరేటి రఘు, ఉప సర్పంచ్ తో పాటు ఇందల్వాయి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ మహేందర్, జితేందర్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article