. . . ఎల్లారెడ్డి పట్టణ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఫామ్ హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 30వ తేదీ శనివారం ఎల్లారెడ్డి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల మాజీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షుడు దాఫేదార్ రాజు హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే ఈ సమావేశం ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సురేందర్ అధ్యక్షతన జరుగుతుందని తెలిపారు. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ మాజీ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షుడు ఏగుల నర్సింలు, శ్రవణ్, ఎరుకల సాయిలు, పాల్దే నారాయణ, చర్ల దేవదాస్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.