27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎబివిపి ఆధ్వర్యంలో నూతన విద్యార్థులకు హెల్ప్ డెస్క్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద సీపీజీఈటీ సెకండ్ ఫేజ్ ద్వార తెలంగాణ యూనివర్సిటీలో నూతన ప్రవేశాలు పొందుతున్న విద్యార్థులకు హెల్ప్ డెస్క్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబివిపి యూనివర్సిటీ అధ్యక్షులు సాయికుమార్ మాట్లాడుతూ నూతన పీజీ అడ్మిషన్స్ జరుగుతున్న సందర్భంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా అలాగే విద్యార్థుల సందేహాలను సమస్యలను పరిష్కరించడానికి ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. అలాగే విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్న ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ను సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు అనిల్,నాయకులు అజయ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article