25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నిజామాబాద్ జిల్లా ఎఐజెపీఎఫ్ కన్వీనర్‌గా డి.ఎల్.ఎన్.చారి నియామకం

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

హైదరాబాద్‌లోని ఆల్ ఇండియా జర్నలిస్టు ప్రొటక్షన్ ఫోర్స్ (ఎఐజెసీఎఫ్) రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కన్వీనర్‌గా డి.ఎల్.ఎన్.చారిని నియమించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ చుంచు కుమార్ చేతుల మీదుగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డి.ఎల్.ఎన్.చారి మాట్లాడుతూ జర్నలిస్టుల బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు సంస్థ సమష్టిగా కృషి చేస్తుందని ఆయన అన్నారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా బాధ్యతలు అప్పగించిన సంస్థ రాష్ట్ర కమిటీకి డి.ఎల్.ఎన్.చారి కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article