నిజామాబాద్ జిల్లా ఎఐజెపీఎఫ్ కన్వీనర్‌గా డి.ఎల్.ఎన్.చారి నియామకం

  హైదరాబాద్, బతుకమ్మ :   హైదరాబాద్‌లోని ఆల్ ఇండియా జర్నలిస్టు ప్రొటక్షన్ ఫోర్స్ (ఎఐజెసీఎఫ్) రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కన్వీనర్‌గా డి.ఎల్.ఎన్.చారిని నియమించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ చుంచు కుమార్ చేతుల మీదుగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డి.ఎల్.ఎన్.చారి మాట్లాడుతూ జర్నలిస్టుల బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు సంస్థ సమష్టిగా...