. . . నగర మేయర్ ఉమారాణి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
మహిళలు స్వయంగా ఉపాధి రంగాల్లో రాణించాలని నగర మేయర్ ఉమారాణి అన్నారు. నగరంలోని గాజుల్ పేట్ లోని కిసాన్ మున్నూరు కాపు సంఘం లో ఎలిప్ సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ 15 రోజుల పాటు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ శిక్షణ ముగింపు కార్యక్రమానికి నగర మేయర్ ఉమారాణి, కార్పొరేటర్ మల్కాయి మహేంధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ టైలరింగ్ శిక్షణలో స్కూల్ యూనిఫాంతో పాటు, వివిధ రకాల దుస్తులు నేర్చుకోవాలన్నారు. అతి తక్కువ సమయంలో శిక్షణలో ప్రతిభ కనబర్చిన మహిళలందరినీ అభినందించి ఎపిక్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రజిత, ట్రైనర్లు నిరీష్ తో పాటు మహిళలు పాల్గొన్నారు.

