30.9 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు పంపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖలో సంస్కరణల కోసం తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఆనాడు సీనియర్ ఐఏఎస్ అధికారిగా పని చేసిన ఆకునూరి మురళికి చైర్మన్ గా ఎంపిక చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణలో విద్యపై సంస్కరణలు, సిఫారసులతో కూడిన నివేదికను అందజేసినట్లు ఆకునూరి మురళి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన పని పూర్తయిన నేపథ్యంలో స్వచ్చందంగా చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నట్లు ఆయన వెల్లడించారు.

More articles

Latest article