. . . 80 కిలోల రాగి తీగలు స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లను ధ్వంసం చేసి రాగీ తీగలను చోరి చేసిన అంతర్ జిల్లా ట్రాన్స్ ఫార్మర్ దోంగలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలిస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఐదుగురు కాపర్ తీగల దొంగలను, వాటిని కొనుగోలు చేసిన ఇద్ధరు స్క్రాప్ వ్యాపారులని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ వెల్లడించారు.. సీపీ కథనం ప్రకారం గురువారం ( ఈనెల 21 న) సాయంత్రం 5 గంటల సమయం లో రెంజల్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి సాటాపూర్ బై పాస్ వద్ద వాహనాల తనిఖీ చేయుచుండగా 5 గురు వ్యక్తులు మూడు మోటార్ సైకిల్ లపై అనుమానస్పదంగా వస్తు పోలీస్ వారిని చూసి పారిపోవుట ప్రయత్నించారు. వాళ్లను పట్టుకొని తనిఖీ చేయగా వల్ల వద్ద ఒక గన్ని బ్యాగ్ లో ట్రాన్స్ ఫార్మర్ కాపర్ కాయిల్స్ ఉన్నాయి. వాళ్ళను విచారించగా మెదక్ జిల్లా కేంద్రంలోని నర్సి ఖేడ్ డబుల్ బెడ్ రూం ప్రాంతానికి చెందిన వనం సాయిలు, జగన్నాధం సారయ్య అలియాస్ శ్రీనివాస్, మెదక్ పట్టణంలోని ఫతేనగర్ కు చెందిన ధన శ్రీ కిరణ్, మెదక్ జిల్లా నారాయణఖేడ్ శాంతినగర్ కు చెందిన దాసరి పోచయ్య ,బోధన్ పట్టణంలోని హన్మంత్ ఖేడి కి చెందిన వనం పోశెట్టి లు ముఠాగా ఏర్పడి గత రెండు సంవత్సరాల కాలంలో మొత్తం (64) ట్రాన్స్ ఫార్మర్లు డ్యామేజ్ చేసి వాటి కాపర్ కాయిల్ లను దొంగతనం చేసినారు.

అందులో నిజామాబాద్ జిల్లా లో రెంజల్ , బోధన్ రూరల్ , బోధన్ టౌన్ , వర్ని, కోటగిరి , నిజామాబాద్ రూరల్ , మోపాల్ , డిచ్ పల్లి , జక్రాన్ పల్లి , ఇందల్వాయి ఏరియాలలో మొత్తం 38 ట్రాన్స్ఫర్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాలు చేశారు. కామారెడ్డి జిల్లా లో కామారెడ్డి, బాన్సువాడ, పిట్లం , మద్నూర్ , భిక్నూర్ , యెల్లారెడ్డి , నాగిరెడ్డిపేట , పెద్ద కొడపగల్ ఏరియాలలో మొత్తం 20 ట్రాన్స్ఫర్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాలు, మెదక్ జిల్లా లో మెదక్ రూరల్, చేగుంట మరియు వెల్దుర్తి ఏరియాలలో మొత్తం 04 ట్రాన్స్ఫర్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాలు చేశారు. సిద్దిపేట జిల్లా లో అక్కన్నపేట ఏరియా మొత్తం 2 ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగతనాలు చేసినారు. దొంగతనం చేసిన కాపర్ కాయిల్ లను స్ర్కాప్ వ్యాపారులు బోధన్ రాకాసి పేట కు చెందిన సయ్యద్ అక్బర్ హుస్సేన్, నిజామాబాద్ గూపన్ పల్లికి చెందిన షేక్ మహబూబ్, మెడ్చల్ జిల్లా కలకాల గ్రామానికి చెందిన మాలప్ప మాస్టర్, మెడ్చల్ జిల్లా అత్వేల్లికి చెందిన తాయప్ప దంగల్ లకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అందులో సయ్యద్ అక్బర్ హుస్సేన్, షేక్ మహబూబ్ లను పట్టుకోగా, మాలప్ప మాస్టర్, తాయప్ప దంగల్ లు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి 80 కిలోల రాగి తీగలు, మూడు బైకులు, 4 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును చేదించడంలో బోదన్ ఎసీపీ పి . శ్రీనివాస్ , సిసిఎస్ ఎసిపి మస్తాన్ అలీ, నిజామాబాద్ సీసీఎస్ సీఐ సాయినాథ్, ఎస్ ఐ లు చంద్ర మోహన్ (రెంజల్) , మచ్చేందర్ రెడ్డి (బోధన్ రూరల్ ) విట్టల్ ( సీసీస్ ఎస్ఐ) సిబ్బందిని అభినందించారు. వారికి రివార్డు ఇస్తామని తెలిపారు.

