29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నూతనంగా నియమించబడ్డ పార్టీ నాయకులకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

మండల కేంద్రములో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సోమా దేవరెడ్డి సమక్షములో నిర్వహించారు. ఈ సమావేశములో తెలంగాణా రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ సభ్యులుగా బాస వేణు గోపాల్ యాదవ్ ను నూతనంగా ప్రభుత్వం నియమించిన సందర్భముగా, ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియమించబడ్డ శివన్నోల్ల శివకుమార్ ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించి ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుని, అభినందనలు తెలిపారు. గడిచిన 10 సంవత్సరాలు ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సేవ చేసిన, సోమ దేవరెడ్డి అధ్యక్షుడిగా విరమణ చేస్తున్న శుభ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు సన్మానం చేశారు. నూతనంగా నియమించబడ్డ తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ సభ్యులు బాస వేణుగోపాల్ యాదవ్, ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివన్నోళ్ల శివకుమార్, మాట్లాడుతూ మాకు పదవులు రావటానికి కృషి చేసిన తెలంగాణ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అలాగే బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్,ఈరవత్రి అనిల్ కుమార్,మానాల మోహన్ రెడ్డి,సుంకెట అన్వేష్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజాపాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సహకరించాలని కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు సమయం వచ్చినప్పుడు పార్టీ పరంగా న్యాయం జరుగుతుందని అన్నారు. సాంప్రదాయ ప్రకారం ప్రతిసారి వరుసగా 10 సంవత్సరాలు ఒకే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవటం ఆచరణగా వస్తుందని ఇదే విషయాన్ని హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకర్ల ప్రెస్ మీట్ లో చెప్పినట్లు గుర్తు చేశారు. మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2034 వరకు అధికారములో ఉంటుందని భాస వేణుగోపాల్ యాదవ్, శివన్నోళ్ల శివకుమార్ అన్నారు. ఈ సమావేశములో ఏర్గట్ల మండల కాంగ్రెస్ సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, తాళ్ల రాంపూర్ పీఏసీఎస్ ఛైర్మెన్, అన్ని గ్రామాల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరి పెళ్లి లింగారెడ్డి,సీనియర్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Honors for newly appointed party leaders

More articles

Latest article