. . . ఆన్ లైన్ లో మందుల విక్రయం
ఏర్గట్ల, బతుకమ్మ :
ఫార్మసిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏర్గట్ల మండల వ్యాప్తంగా మెడికల్ షాప్ యజమానులు బుధవారం స్వచ్ఛందంగా దుకాణాలను బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పలు మెడికల్ షాపులు మూతపడటంతో మండల ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫార్మసీ రంగానికి సంబంధించిన వివిధ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఆన్‌లైన్, అనధికార మందుల విక్రయాలను అరికట్టాలని, అర్హత కలిగిన ఫార్మసిస్టులకే ఔషధ విక్రయ అనుమతులు ఇవ్వాలని వారు కోరారు. ఏర్గట్ల మండల పరిధిలోని మెడికల్ షాప్ నిర్వాహకులు మాట్లాడుతూ, చిన్న వ్యాపారులు అనేక ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ బంద్‌కు మండలంలోని మెడికల్ షాప్ యజమానులు,ఫార్మసిస్టులు మద్దతు తెలిపారు. అనంతరం తమ డిమాండ్లకు సంబంధించిన వినతిపత్రాన్ని పై అధికారులకు పంపడం జరిగిందని తెలిపారు.