24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ లో ఆరోగ్య శిబిరం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఆరోగ్యవంతంగా ఉండటానికి ఆరోగ్య పరీక్షలే ముఖ్యమని నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి జలగం తిరుపతి రావు అన్నారు. క్లబ్ సభ్యుల ఆరోగ్యమే మహాభాగ్యమని భావించి క్లబ్ తరపున ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ వైద్యులచే సభ్యులందరికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు చేశామని అందరు దీర్ఘ ఆయుస్సుతో ఉండాలనే మహా సంకల్పం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజు వ్యాయామం, నడక అలవాటు చేసుకొని ఆచరించాలని సూచించారు. క్రమం తప్పకుండా సమయానికి ఆహారం తీసుకోవాలన్నారు. మన ఆరోగ్యం కోసం మనం కొంత సమయాన్ని కేటాయించుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని విన్నవించారు. క్లబ్ లో షటిల్, బ్యాట్మింటన్, బిల్యార్డ్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయని అవి శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉపయుక్తంగా ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి వైద్యులు శ్రీనివాస్, చెవి ముక్కు గొంతు వైద్యులు హరీష్ స్వామి, దంత వైద్యులు శీను నాయక్ లు ఉచిత వైద్య సేవలు అందిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి, కోశాధికారి సురేష్ గౌడ్, క్లబ్ సభ్యులు సాయిబాబా, శశిధర్ రెడ్డి, మీసాల సుధాకర్ రావు, ఢిల్లీ, ఆశ నారాయణ, దాసరి పుష్యమిత్ర, సంతోష్, క్లబ్ మేనేజర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

More articles

Latest article