25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

నాలుగు కోడ్ ల వల్ల కార్మికులకు భద్రత లేకుండా పోయింది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . వెంటనే కార్మిక చట్టాలను అమలు జరపాలి

 

. . . నాలుగు లేబర్ కోడ్ ల గెజిట్ ను దగ్దం చేసిన నాయకులు

 

. . . సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నాలుగు లేబర్ కోడ్ ల మూలంగా కార్మికులకు భద్రత లేకుండా పోయిందని, ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేక చర్యకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదని, వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసి, కార్మిక చట్టాలను అమలు జరపాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నాలుగు లేబర్ కోడ్ లను అమలు జరపటానికి నిర్ణయించి గెజిట్ ను విడుదల చేయడంతో సిఐటియు ఆధ్వర్యంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్, యూనియన్ కార్మికులు జిల్లా కేంద్రంలోని లేబర్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించి లేబర్ కోడ్ లకు సంబంధించిన గెజిట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు లేబర్ కార్డులను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు యజమానులకు మరింత లాభాలను పెంచటానికి కార్మిక హక్కులను పణంగా పెట్టి కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావడం జరిగిందని అన్నారు. వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాటాలు నిర్వహించినప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వాటిని లెక్కచేయకుండా గెజిట్ ను విడుదల చేసిందని మండి పడ్డారు. ఫలితంగా యాజమాన్యాలు లేబర్ కోడ్ లను అమలు జరపటానికి పని గంటలు పెంచటానికి వేతనాల్లో కోతలు విధించడానికి సిద్ధపడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే కార్మిక చట్టాలను అమలు చేయాలని లేని యెడల రాబోయే కాలంలో అన్ని రంగాల కార్మికుల తోటి ఉద్యోగుల తోటి ఐక్య పోరాటాలకు సిద్దపడాల్సి వస్తుందని, దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ రిప్రెంటేటివ్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గంగా మోహన్, నాయకులు సంపత్, శేషు, లక్ష్మీకాంత్, కులకర్ణి, తదితరులు పాల్గొన్నారు.

 

Four codes have left workers without safety.

More articles

Latest article