26.2 C
Hyderabad
Monday, August 3, 2026

నూతన హెల్త్ కార్డుల జారీ బాధ్యత ట్రెజరీ అధికారులే చేపట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వ పింఛన్ దారులకు నూతన హెల్త్ కార్డుల ఇచ్చే విధంగా డేటా బేస్ ను ప్రభుత్వానికి పంపించే బాధ్యతను ట్రెజరీ అధికారులు చేపట్టాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ బుధవారం ట్రెజరరీ డిప్యూటీ డైరెక్టర్ దశరథ్ కు విజ్ఞప్తి చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల పూర్తి వివరాలు ట్రెజరీ అధికారుల వద్ద ఉన్నది కాబట్టి వారే రిటైర్డ్ ఉద్యోగుల సమాచారాన్ని పై అధికారులకు పంపి వారికి నూతన హెల్త్ కార్డులు అందించే విధంగా చర్య చేపట్టాలని వారు ట్రెజరరీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఈ మండుటెండల్లో వయో వృద్ధులైన రిటైర్డ్ ఉద్యోగులను మీ సేవ, కంప్యూటర్ సెంటర్ల చుట్టూ తిప్పకుండా ప్రభుత్వం ఈ సహాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ట్రెజరరీ డిప్యూటీ డైరెక్టర్ ని కలిసిన వారిలో అధ్యక్షులు రామ్మోహన్ రావు, అధ్యక్షులు సిర్ప హనుమాన్లు, ఉపాధ్యక్షులు ప్రసాద్ రావు, నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి సాంబశివరావు, జిల్లా నాయకులు భోజరావు, రాజేశ్వర్, ట్రెజరరి అధికారులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article