24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రాయకూర్ సొసైటీ లో జీలుగా విత్తనాల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని రాయకూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద బుధవారం 50% సబ్సిడీతో జీలుగా విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సంఘ అధ్యక్షులు పరుచూరి సంఘమేశ్వర్ రావు మాట్లాడుతూ.. రైతులు జీలుగా విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాపాస్ బుక్ జిరాక్స్, తీసుకొని ఏఈఓ దగ్గర పర్మిట్ జనరేట్ చేసుకొని రాయకూర్ సంఘానికి వచ్చి 30 కేజీ బస్తా ధర రూ. 2452.50/- చెల్లించి తీసుకోగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు తోట అరుణ్ కుమార్, ఏఈఓ వెంకటేష్, మాజీ ఎంపీటీసీ హన్మంత్ రావు, సంఘ పరిధిలోని గ్రామాల రైతులు తాటే నితిన్, కోర్బ సాయిలు, తోట వెంకటేశం, కాసుల పోశెట్టి, సంఘ మాజీ కార్యదర్శి గంగారాం, సంఘ సెక్రటరీ ఎర్రోళ్ల సాయి కిరణ్, సంఘ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article