27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఎల్లాపు సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ లో ఎల్లాపు సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మంగళవారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో జరిగిన ఎన్నికల నిర్వహణకు సాయిని నర్సింగ రావు, లక్కాకుల సురేందర్ రావు, సల్వాజీ జనార్దన్ రావు లు హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు వీర్ల వెంకటేశ్వర్ రావు ఆదేశానుసారం నిర్వహించిన ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా తేలు వేణుగోపాల్ రావు, ప్రధాన కార్యదర్శి గా కొప్పుల రాఘవేందర్ రావు, ఉపాధ్యక్షులు గా గాదె శ్రీనివాస్ రావు, కోశాధికారి గా బొంగురాల శ్రీనివాస్ రావు, గౌరవ అధ్యక్షులు గా ఎల్లంకి సత్యనారాయణ రావు, అసోసియేట్ అధ్యక్షులు గా ఉలిసే రాజేశ్వర్ రావు, ముఖ్య సలహాదారులు పుప్పాల కమలాకర్ రావు, డాక్టర్ పడాల జగన్మోహన్ రావు, కార్యనిర్వాహక కార్యదర్శులు గా ఎల్లంకి మధుసూదన్ రావు, వీర్ల శ్రీనాథ్ రావు, సంయుక్త కార్యదర్శులు గా ఔదరి ఏగొండ, ఎల్లంకి పురుషోత్తం రావు, పుప్పాల విద్యాసాగర్ రావు, బత్తుల నటరాజ్ మహిళా ప్రతినిధులుగా గంటా జ్యోతి, ఉలిసే జ్యోతి, కొప్పుల పద్మ, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ సాయిని శ్రీధర్ రావు, వీరమళ్ళ లక్ష్మికాంతారావు, బాస నరేందర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బొంగురాల గంగాధర్ రావు, గంటా హన్మంత రావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కుల సభ్యులు, నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు, ఎన్నికల పరిశీలకులు తదితరులు హాజరయ్యారు.

More articles

Latest article