29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సరైన ప్రోత్సాహం అందిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రాం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉందని, సరైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రాం అన్నారు. మంగళవారం ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేసి సత్కరించారు. అలాగే విద్యార్థుల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. విద్యార్థులు లక్ష్యసాధన కోసం క్రమశిక్షణతో చదువుతో పాటు సామాజిక బాధ్యతను కూడా అలవర్చుకోవాలని సూచించారు.

 

If given the right encouragement, they will reach higher levels.

More articles

Latest article