. . . టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రాం
హైదరాబాద్, బతుకమ్మ :
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉందని, సరైన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రాం అన్నారు. మంగళవారం ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేసి సత్కరించారు. అలాగే విద్యార్థుల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. విద్యార్థులు లక్ష్యసాధన కోసం క్రమశిక్షణతో చదువుతో పాటు సామాజిక బాధ్యతను కూడా అలవర్చుకోవాలని సూచించారు.
