24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చీత ఫోర్స్  స్ట్రైక్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మూడు చోట్ల దాడులు … 38 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలో అక్రమంగా రవాణా, కొనుగోలు చేస్తున్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం ( రేషన్) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ ఇన్‌చార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీత ఫోర్స్ ,పోలీసు సిబ్బంది సోమవారం తెల్లవారుజామున నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిలయన్స్ షాపింగ్ మాల్ ఎదురుగా రోడ్డుపై అనుమానాస్పదంగా వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం నెంబర్ టీఎస్ 16 యు సి 8373 ను పోలీసులు ఆపి తనిఖీ చేశారు. తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 30 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Cheetah Force strikes on smuggling of ration rice

స్వాధీనం చేసుకున్న బియ్యం ,వాహనాన్ని తదుపరి విచారణ నిమిత్తం 4 టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. నగరంలోని ఓకటవ టౌన్  పోలీస్ స్టేషన్ పరిధిలోని ముజాహిద్ నగర్ కాలనీలో గల అబ్దుల్ అల్తాఫ్  వద్ద అక్రమంగా కొనుగోలు చేసిన దాదాపు 6 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టుకుని సంబంధిత పోలీసులకు అప్పగించడం జరిగింది. రెండవ టౌన్  పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తయిద్ పుర కాలనీలో గల సయ్యద్ సాజిద్ అలీ వద్ద రెండు క్వింటాళ్ల పీడీఎస్ రైస్ స్వాధీనం చేసుకొని సంబంధిత ఎస్ హెచ్ ఓ కు అప్పగించడం జరిగింది. రేషన్ బియ్యం కొనుగోలు, అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Cheetah Force strikes on smuggling of ration rice

More articles

Latest article