బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో గత కొంతకాలంగా విధులు నిర్వహించి వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ అయిన 13 మంది సిబ్బందికి ఆదివారం బాన్సువాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పట్టణ ఇన్స్ పెక్టర్ టి. శ్రీధర్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్లిన సిబ్బందిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. బాన్సువాడలో వారు అందించిన సేవలను, శాంతి భద్రతల పరిరక్షణలో వారి కృషిని ఇన్స్ పెక్టర్ శ్రీధర్ కొనియాడారు. కొత్త స్టేషన్లలో కూడా అదే అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్ పెక్టర్ లు, పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ పాల్గొని బదిలీపై వెళ్తున్న సహచరులకు శుభాకాంక్షలు తెలిపారు. స్టేషన్లో అందరితో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను సిబ్బంది గుర్తు చేసుకున్నారు.
