30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

108 సేవల ఆకస్మిక తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లాలో 108 అంబులెన్స్ ల నిర్వహణ, అందిస్తున్న సేవలను పరిశీలించేందుకు ఎస్ సీ ఎం హెడ్ సత్యనారాయణ, ప్రాజెక్టు మేనేజర్ మధు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాహనాల పనితీరు, సిబ్బందికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ప్రజలకు నిరంతరం సేవలందించేలా సూచనలు చేశారు. 108 అంబులెన్స్ లతోపాటు 102, 1962 ఎఫ్ హెచ్ ఎస్ వాహనాలను తనిఖీ చేశారు. వారివెంట జిల్లా ఇన్ చార్జి శ్రీకాంత్, 108 సిబ్బంది, ఏ సంతోష్ రెడ్డి, కె రాజు, రాజయ్య, 1962 ఎఫ్ హెచ్ ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.  

 

More articles

Latest article