బాన్సువాడ, బతుకమ్మ: రాష్ర్ట ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని రాష్ర్ట ఆగ్రో ఇండస్ర్టీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో తిమ్మపూర్ సొసైటీ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శంకర్, మాజీ ఎంపీపీ రఘు, సొసైటీ అధ్యక్షుడు హన్మంత్ రావు , అప్పారావు , సొసైటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, గంగుల గంగాధర్, నియోజకవర్గ అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి, వెంకన్న, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, సానేపు గంగారాం, రాములు, శశికాంత్ , దొంతురాం కాశీరాం, షాహబ్, ఖమ్రూ తదితరులు పాల్గొన్నారు.
