29 C
Hyderabad
Monday, August 3, 2026

ముప్కాల్ లో గన్ని బ్యాగుల కొరత

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రోడ్లపై, కల్లాల్లోనే ధాన్యం

 

ముప్కాల్, బతుకమ్మ:

 

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం రాశుల మాదిరిగా దిగుబడి వచ్చిన రైతులకు దిగులు తప్పడం లేదు. ధాన్యం ను కొనుగోలు చేయాలంటే ముందు తూకం జరగాలి. వడ్లను కల్లాలలో, రోడ్లపై ఆరబెట్టిన కర్షకులు మంచి తేమ శాతం వచ్చిన వాటిని ఎత్తి తరలించేందుకు గోనే సంచులు లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో రైతన్నలు అరి గోస పడుతున్నారు. దాదాపు కిలోమీటర్ రోడ్డులో ధాన్యంను రైతులు ఆరబోశారు. ఎక్కడ అకాల వర్షం అతలాకుతలం చేస్తుందో అని భయపడుతూ గన్ని బ్యాగులు కావాలని, లారీలను పంపాలని కోరుతున్నారు. విషయం తెలిసిన బిజేపి నేత సంతోష్ రైతులతో చర్చించారు. జిల్లా సహకార అధికారికి ఫోన్ చేసి గోనే సంచులు పంపాలని, లారీలను కూడా పంపితే ధాన్యం తరలింపు సులువుగా ఉంటుందని కోరడంతో డిసీఒ సానుకులంగా స్పందించారు. మూడు రోజులలో ముప్కాల్ రైతుల సమస్యలను తీర్చుతానని హమీ ఇచ్చారు.

More articles

Latest article