25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

హెచ్ పివి వ్యాక్సిన్ తో గర్భాశయ క్యాన్సర్ రాకుండా రక్షణ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

హెచ్ పివి వ్యాక్సిన్ వల్ల గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రాకుండా 93 నుండి 100% వరకు సురక్షితం గా ఉంటుందని, బాలికల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక మాలపల్లి, అర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని మత పెద్దలకు, డివిజన్ కార్పొరేటర్లకు హెచ్ పివి వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ద్వారా మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుందని, ఈ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా బాలికల్లో హెచ్ పివి టీకాలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. భారతదేశంలో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తరువాత రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని అన్నారు. హెచ్ పివి వ్యాక్సిన్ కొత్త వ్యాక్సిన్ కాదని ప్రపంచవ్యాప్తంగా 2006 వ సంవత్సరం నుండి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ హెచ్ పివి టీకాల పట్ల ప్రజల్లో అనేక అపోహాలు ఉన్నాయని, ముఖ్యంగా ఈ టీకా ద్వారా బాలికల్లో సంతానోత్పత్తి కలగదని, నెలసరి ఋతుచక్రంపై ప్రభావం చూపుతుందని అపోహాలు ఉన్నాయన్నారు. కానీ ఈ వ్యాక్సిన్ సంతానోత్పత్తి పై, బాలికల్లో నెలసరి చక్రంపై ఎటువంటి ప్రభావాన్ని చూపదని తెలియజేశారు. అన్ని టీకాల మాదిరి ఈ టీకా తీసుకున్న తర్వాత కొద్దిపాటి దురద నొప్పి లాంటివి మామూలే అని పేర్కొన్నారు.  ఈ హెచ్ పివి టీకాలపై జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డా.అశోక్, డా.అజ్మల్, డా.అజ్మతున్నీసా బేగం పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ సల్మా తహసీన్ మాట్లాడుతూ మైనార్టీ ప్రాంతంలోని ప్రతి ఒక్క అర్హులైన బాలికకు హెచ్ పివి టీకాను ఇప్పించడానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డా.సికందర్ నాయక్, రాణా ప్రతాప్, డా.నవ్య, కార్పొరేటర్లు, షకీల్ సాహబ్, ఇంతియాజ్ సాహబ్, రియాజ్ సాహెబ్, అమన్ ఫారూఖ, ఆదిత్య, ముజీబ్, ఆజాద్, తదితర మత పెద్దలు, డిహెచ్ఈ గన్పూర్ వెంకటేశ్వర్లు, గోవర్ధన్, మనోహర్, తరుణ్, శ్యామల, షాదుల్లా, ఏఎన్ఎం లు, వైద్య సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.

 

HPV vaccine protects against cervical cancer

More articles

Latest article