27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మే 15న సమాచార హక్కు పై సదస్సు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కె.రామ్మోహన్ రావు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సమాచార హక్కు చట్టం అమలు, తీరు తెన్నులు పై మే 15 న సాయంత్రం 5:30 గంటలకు పెన్షనర్స్ భవనం సుభాష్ నగర్ నిజామబాద్ లో సదస్సును ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కే.రామ్మోహన్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ పీ.వీ.శ్రీనివాస్ రావు, దేశినేని భూపాల్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. వీరితో పాటుగా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు అలుక కిషన్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ యూనియన్ నాయకులు శిర్ప హనుమాన్లు, ఈవిల్ నారాయణ, మల్లు స్వరాజ్యం ట్రస్ట్ అధ్యక్షుడు రవీంద్రనాథ్ సూరి, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు బొబ్బిలి నరసయ్య తదితరులు హాజరవుతున్నట్టు ఆయన తెలిపారు. అధిక సంఖ్యలో ఆర్టిఐ కార్యకర్తలు, మేధావులు, ప్రజా సంఘ కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article