24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మే 23న జరిగే జిల్లా మహాసభను విజయవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా 11వ మహాసభను ఈ నెల 23 శనివారం మోపాల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్నామని, రైతులు, కూలీలు, ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయాలని ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు మామిడాల  బిక్షపతి, ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య హాజరవుతున్నారని వారు తెలిపారు. బుధవారం మోపాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎఐకెఎంఎస్ సమావేశంలో వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలు చేపడుతున్నాయని ఆయన అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా రైతులు వ్యవసాయంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, పాలకుల తప్పుడు విధానాల మూలంగా రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదని, పంట వచ్చిన తర్వాత ధాన్యం  అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారన్నారు. నెలల తరబడి ధాన్యం కుప్పల వద్ద పడి కాపులు కాస్తూ తీవ్రమైన ఎండలకు సొమ్మసిల్లి అస్వస్థకు గురవుతున్నారని తెలిపారు. రైతులకు ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఏ మాత్రం అమలు చేయలేకపోయారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు జిల్లాలో మూతబడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని రైతులకు ఇచ్చిన గత ప్రభుత్వం హామీ లాగానే వీరు కూడా మోసం చేశారని వారన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మంచిప్ప 21 ప్యాకేజీ పనులకు తగిన నిధులు ఇవ్వకుండా పనులను పెండింగ్ లోనే ఉంచుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలు తీసుకువస్తూ రైతులను, రైతు కూలీలను తమ భూముల నుండి వ్యవసాయం నుండి దూరం చేస్తుందని అన్నారు. ఇలాంటి రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక మోడీ ప్రభుత్వ విధానాలు ఉపసంహరించుకోవాలని వారు కోరారు. అందుకు గాను గత మహాసభ నుంచి నేటిదాకా జరిపిన రైతాంగ ప్రజా ఉద్యమాలను ఈ మహాసభలు చర్చించుకుని భవిష్యత్తులో రైతాంగ పోరాటాలను తీవ్రతరం చేయడానికి గానూ తగిన కర్తవ్యాలను రూపొందించుకుంటామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న,  న్యూ డెమోక్రసీ కార్యదర్శి బండమీది నరసయ్య, అగ్గు  చిన్నయ్య, గుడ్డోల్ల గంగాధర్, మమ్మాయి లింగం, మమ్మాయి మోహాన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article