27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

డిసెంబర్ 1 వరకు 99 శాతం గా మార్చాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

‘మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష’ లో మన జిల్లా లో నూటికి 92 శాతం ఉన్న వైరల్ లోడ్ శాతాన్ని డిసెంబర్ 1 వరకు 99 శాతంగా మార్చడానికి కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి సోకిన వారు క్రమం తప్పకుండా మందులు వాడాల్సిన అవసరం ఉందని, అలా వాడిన వారికి వైరల్ లోడ్ క్రమంగా తగ్గి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి రాజశ్రీ, అదనపు జిల్లా వైద్యాధికారి ఎయిడ్స్& లెప్రసీ డాక్టర్ దేవి నాగేశ్వరి, ఏ ఆర్ టి సెంటర్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, డిపిఎం సుధాకర్, సహాయోగి సమత, ఐసిటిసి కౌన్సిలర్లు ఏఈర్ టి కౌన్సిలర్, డేటా మేనేజర్లు పాల్గొన్నారు.

More articles

Latest article