28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి తొలగించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బండి సంజయ్ ని మంత్రి పదవి నుంచి తొలగించాలని, బండి భగీరథుని అరెస్టు చేసి జైలుకు పంపాలని ఐద్వా మహిళా సంఘం తరపున డిమాండ్ చేస్తున్నామని ఐద్వా కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. నిజామాబాద్ జిల్లా ఐద్వా ఆధ్వర్యంలో నాందేవాడ ఆఫీస్ లో సోమవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. రోజురోజుకీ హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో జరిగినటు వంటి మైనర్ బాలిక అత్యాచారం కేసు లో బండి భగీరథ ని అరెస్టు చేసి జైలుకు పంపాలి. ఆ కేసును పక్కతోవ పట్టించడం కోసం  హనీ ట్రాప్ కేసు పెట్టి మైనర్ బాలిక కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేస్తూ రూ.50 వేల నగదు ఇస్తామని కేసు నుంచి పక్కకు తప్పుకోమని కుటుంబాన్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ మైనర్ బాలిక కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేయడం కరెక్ట్ కాదని అన్నారు. లేదంటే రేపు రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి అడివాలా అనిత, నగర కమిటీ సభ్యురాలు కె.శ్రీ దేవి  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article