. . . అత్యల్ప ధర రూ.10,600
. . . మార్కేట్ యార్డ్ కు వెల్లువేత్తుతున్న ఆమ్ చూర్
నిజామాబాద్, బతుకమ్మ:
తెలుగు రాష్ట్రంలోనే ఏకైక పెద్ద మార్కెట్ గా ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆమ్ చూర్ రాక మొదలయింది. గత వారం రోజుల నుండి ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి రైతులు ఆమ్ చూర్ ని నిజామాబాద్ మార్కెట్ కు తరలిస్తున్నారు. గత శనివారం 329 క్వింటాళ్ ఆమ్ చూర్ మార్కెట్ కి వచ్చింది. ధర కూడా గతంతో పోల్చితే ఎక్కువే వచ్చింది. దిగుబడి భాగానే ఉన్నా.. అకాల వర్షాలతో కాత రాలిపోయింది. గత సంవత్సరం కన్నా ఎక్కువ ధర వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆమ్ చూర్ ధరలు గత సంవత్సరం లాగే స్థిరంగా ఉన్నాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డులో శనివారం అత్యదికంగా రికార్డ్ స్థాయిలో క్వింటాల్ ఆమ్ చూర్ ధర రూ.36,500 లు పలికింది. మోడల్ ధర 25,800 ఉండగా అత్యల్పంగా రూ.10600 పలికింది. గత 5 సంవత్సరాలలో ఇదే అధిక ధర. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి మామిడి దిగుబడి ఎక్కువగా ఉంది. కానీ ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులకు కాయ రాలిపోయింది. దీంతో కాయలు కోసి ఆరబెట్టీ ఆమ్ చూర్ ని మార్కెట్ కి తరలిస్తున్నారు. సాదారనంగా మే నెలలో ఆమ్ చూర్ మార్కెట్ కి వస్తుంది. కానీ ఈ సారి ఏప్రిల్ చివరి వారంలోనే ఆమ్ చూర్ ని మార్కెట్ కి తరలించారు రైతులు. దీంతో మార్కెట్లొ ఆమ్ చూర్ లభ్యమవుతుంది. దీంతో ధరలు భాగా పెరిగాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఆమ్ చూర్ కి నిజామాబాద్ మార్కెట్ రెండో అతిపెద్ద మార్కెట్. ఇక్కడి నుండి ఉత్తరాది రాష్ట్రాలకు, విదేశాలకు ఆమ్ చూర్ ఎగుమతి అవుతుంది. నిజామాబాద్ మార్కెట్ లొ ఆమ్ చూర్ కి మంచి ధరలు లభిస్తుండటంతో ఇతర ప్రాంతాల రైతులు ఇక్కడికి వచ్చి ఆమ్ చూర్ అమ్ముకుంటూన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆమ్ చూర్ విక్రయాలకు ఏకైక కేంద్రంగా ఉంది. మహభూబ్ నగర్ మొదలుకోని జగిత్యాల, మెదక్ జిల్లాల మామిడి రైతులు ఆమ్ చూర్ ను నిజామాబాద్ మార్కెట్ యార్డులో విక్రయిస్తారు. ఏటా ఈ సీజన్ లో వివిద జిల్లాల నుంచి రైతులు, గుతేదారులు ఆమ్ చూర్ ని పెద్ద సంఖ్యలో నిజామాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొస్తుంటారు. మండుటేండల్లో కూడా ఆమ్ చూర్ రాశులతో మార్కెట్ యార్డు కళకళలాడేది. అయితే ఈ సారి మామిడి పూత, కాత త్వరగా రాలిపోయి దిగుబడి తక్కువగా ఉండటంతో … మంచి ధరలు వస్తుండాటంతో రైతులు ఆనందంగా ఉన్నారు. ఉన్న పంటను కొనేందుకు వ్యాపారులు ముందుకు వస్తుండటంతో ఆమ్ చూర్ రైతులు నిజామాబాద్ మార్కెట్ కి భారీగా తరలివస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్లొ 3-4 ఏళ్ళూగా ఆమ్ చూర్ వ్యాపారం పెద్దగా సాగలేదు. గత సంవత్సరం కొద్దిగా మార్కెట్లో క్రయవిక్రయాళు జరిగాయి. ధరలు కూడా అంతకు ముందుతో పోల్చితే భాగానే వచ్చాయి. హైదరాబాద్ లోని గుడి మల్కాపూర్ మార్కెట్లొ కొనుగోళ్ళూ ఉన్నప్పటికి 80 శాతంపైగా పంట నిజామాబాద్ మార్కెట్ కి వచ్చేది. ప్రతి సంవత్సరం 22.50 కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది. అయితే గత సంవత్సరానికి ముందు… 5 ఏళ్ళుగా కరోనా వైరస్ ప్రభావంతో మార్కెట్లు మూతపడటంతో ఆమ్ చూర్ రైతులు ఆందోళనలొ చెందారు. మార్కెట్లు మూతపడటం, రవాణా సౌకర్యం సరిగా లేకపోవటంతో పంటను ఎక్కడికి తీసుకుపోవాలో అర్థం కాక తలలు పట్టూకున్నారు రైతులు. అయితే గత సంవత్సరం తిరిగి నిజామాబాద్ మార్కెట్లో ఆమ్ చూర్ కొనుగోళ్ళూ ప్రారంభం అయ్యాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డులో ప్రతి సంవత్సరం 15 వేల క్వింటళ్ళ ఆమ్ చూర్ విక్రయాలు జరుగుతాయి. కానీ ఈ సారి మామిడి పూత, మామిడి కాత లేక దిగుబడి అంతంత మాత్రమే ఉండటంతో.. ఉన్న ఆ మాత్రం పంటను కూడా వ్యాపారులు పోటీ పడుతున్నారు. దీంతో కనీస ధర రూ.18 వేల పై చిలుకు పలుకుతుంది.

ఆమ్ చూర్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. మనం వంటకాల్లో చింత పండు వాడినట్లుగా అక్కడ ప్రజలు ఆమ్ చూర్ వాడతారు. మామిడి కాయలు ఈదురు గాలులకు రాలీపోయినా.. ధర రాకున్నా ఆమ్ చూర్ గా విక్రయిస్తారు. ఇక్కడ ఆమ్ చూర్ వాడకం తక్కువగా ఉన్నప్పటికి గుజరాత్ వ్యాపారులు దీన్ని కొని ఎగుమతి చేస్తారు. అక్కడ ఉన్న డిమాండ్, నిల్వలను బట్టీ ధర నిర్ణయిస్తారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో 15 మంది ఆమ్ చూర్ వ్యాపారులున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డు పసుపుతో పాటు ఆమ్ చూర్ కి ఫేమస్. ఆమ్ చూర్ అమ్మేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డీ, నల్గొండ జిల్లాల నుండీ రైతులు ఇక్కడికి వస్తారు.2-3 రోజులైనా ఇక్కడే మకాం వేసి అమ్ముకుంటారు. ఆమ్ చూర్ కొనేందుకు రెండు, మూడు మార్కెట్లున్నా మంచి గిట్టు బాటు ధర దొరుకుతుందన్న భరోసాతో ఇక్కడికి వస్తారు. నిజామాబాద్ మార్కెట్ నుండి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి అవుతుంది ఆమ్ చూర్. ఏటా మే నెల మొత్తం ఈ వ్యాపారం నడుస్తుంది. మామిడికాయ పీచుగా అయిన వెంటనే తొక్కలు కోస్తారు. వాటిని ఎండబెట్టీ వర్షాలు రాకముందే అమ్ముకుంటారు. నిజామాబాద్ యార్డులో రోజుకు వంద క్వింటాళ్ళూ వరకు తీసుకొస్తారు. డిమాండ్ ను బట్టి క్వింటాలుకు రూ.8 వేల నుండి రూ.24 వేల వరకు ధర పలుకుతుంది. సగటున రూ.15 వేలు అమ్ముకున్నా ఏటా రూ.22.50 కోట్ల వ్యాపారం జరుగుతుంది. మార్కెట్ కమిటీలో ఈ పంట కొనుగోలు చేయాలనే నిబందన లేకున్నా వ్యాపారుల ఆసక్తిని బట్టీ కొనుగోళ్ళూ నిర్వహిస్తారు. దీని ద్వారా మార్కెట్ యార్డూకి రూ.22 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అయితే ఈ సారి మామిడి కాత, దిగుబడి ఎక్కువగా ఉన్నా… అకాల వర్షాల కారనంగా మామిడి కాయలు భాగా రాలిపోయాయి. దింతో మామిడి కాయ ప్రస్తుతం మార్కెట్ అనుకున్న స్థాయిలో అందుబాటులో లేదు. దింతో ఆమ్ చూర్ కి బాగా డిమాండ్ భాగా పెరిగింది. తద్వారా గతంతో పోల్చితే ధరలు కూడా రెట్టీంపు అయ్యాయి..

