27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సమిష్టి కృషితో విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి

 

. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, జనాభా గణన, విద్యా వారోత్సవాలపై శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ అన్ని జిల్లాలలో వంద శాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. సెల్ఫ్ ఎన్నూమరేషన్ కు ఒక్క రోజే మిగిలి ఉండడంతో ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో పది లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వీరంతా స్వీయ గణన చేసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని సిఎస్ దిశా నిర్దేశం చేశారు.

 

Grain procurement should be expedited.

 

వీ.సీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు కీలక సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటే వెంటనే తూకం జరిపించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. ధాన్యం లోడింగ్ ఆన్ లోడింగ్ లో జాప్యం జరగకుండా సరిపడా సంఖ్యలో హమాలీలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, వారికి భోజన సౌకర్యం కల్పించాలని కలెక్టర్ సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ పరిస్థితుల గురించి రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. జనాభా గణన ప్రక్రియలో భాగంగా కొనసాగుతున్న స్వీయ నమోదును అన్ని వర్గాల వారు స్వీయ గణన చేసుకునేలా కృషి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ, ఆశా వర్కర్లను కూడా భాగస్వాములు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువు లోపు జిల్లాలో అత్యధిక మంది స్వీయ గణన పూర్తి చేసుకునేలా చొరవ చూపాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న విద్యా వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై ఆసక్తిని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ జిల్లాలో వంద శాతం పూర్తయ్యేలా చొరవ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ప్రవీణ్, డీఆర్డీఓ సాయన్న, డీఏఓ వీరస్వామి, డీఈఓ అశోక్, డీసీఓ శ్రీనివాస్, ఏఎస్ఓ అరవింద్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

 

Grain procurement should be expedited.

More articles

Latest article