27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సువేంధు అధికారి అనే నేను… పశ్చిమ బెంగాల్ సీఎం గా ప్రమాణం చేస్తున్నా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . హజరైనా ప్రధాని నరేంద్ర మోడీ

 వెబ్ డెస్క్, బతుకమ్మ:

పశ్చిమ బెంగాల్ సీఎం గా సింధు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటివల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి 200 పైచిలుకు స్థానాలు గెలిచిన విషయం తెలిసిందే. అక్కడ కమలం పార్టీ గెలుపు తీరాలకు చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించిన సువేంధు అధికారిని శుక్రవారం శాసన సభ పక్ష నేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. శనివారం కోల్ కత్తాలో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన అట్టహాసమైన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సువేందు అధికారి సీయంగా, మంత్రులుగా అగ్నిమిత్ర పాల్, దిలీప్ ఘోష్, అశోక్ కిర్టానియా, నిషిత్ ప్రామాణిక్, క్షుదీరామ్ టుడులు ప్రమాణం చేశారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ గెలుస్తుంది ప్రభుత్వం కోలువుదిరే కార్యక్రమానికి హాజరవుతారని ఎన్నికల ప్రచార సభలో ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ వేడుకలకు హాజరయ్యారు. మోడితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో పాటు కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు… కోత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సువేంధు అధికారికి, మంత్రులకు అందరూ శుభాకాంక్షలు తెలిపారు.

I, Suvendhu Adhikari... take oath as the Chief Minister of West Bengal

More articles

Latest article