27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఎండల తీవ్రత నేపథ్యంలో రైతులు పశువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Must read

 

. . . సర్పంచ్ లోకని గంగామణి గంగారాం

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఇందల్ వాయి గ్రామంలో శుక్రవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఇందల్ వాయి పశువుల ఆసుపత్రిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వేసవిలో పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన వాల్ పోస్టర్ లను సర్పంచ్ లోకని గంగామణి గంగారం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరు నవీన్ గౌడ్ ఆవిష్కరించారు. సర్పంచ్ లోకని గంగామణి గంగారం మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల పశువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన పిఎసిఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ మహేందర్, వైస్ చైర్మన్ రఘుపతి రెడ్డి, మల్లారెడ్డి, పిఎసిఎస్ సీఈఓ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ పరమేష్, సాంబయ్య, రవి, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article