27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎంపీటీసీలను యధావిధిగా కొనసాగించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . హెడ్ క్వార్టర్ ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్ 

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

ప్రస్తుతం ఉన్న ఎంపీటీసీలను ప్రభుత్వం యధావిధిగా కొనసాగించాలని హెడ్ క్వార్టర్ ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్ అన్నారు. శుక్రవారం సాయి బాబా మందిరంలో తాజా, మాజీ ఎంపీటీసీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో మాజీ చైర్మన్ లకే మళ్లీ చైర్మన్ గా అవకాశం ఇచ్చినందున ఎంపీటీసీలను సైతం అదే తరహాలో కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలను, అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కోసం నిత్యం గ్రామాలలో తిరుగుతూ అభివృద్ధి చెందేందుకు ఎంపీటీసీలు ఎంతో దోహదపడతారని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల తాజా, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article