24.7 C
Hyderabad
Monday, August 3, 2026

సికింద్రబాద్ లో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేసిన యువతి బందువులు

 సికింద్రబాద్ , బతుకమ్మ :

ప్రేమించిన పాపానికి సికింద్రాబాద్‌లో నడిరోడ్డుపై యువకుడి దారుణంగా హత్య కు గురయ్యాడు. యువకుడిని కత్తితో 17 చోట్ల పొడిచి హతమార్చిన యువతి బంధువులు . జవహర్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటూ నాలుగేళ్లుగా సీతాఫల్‌మండి ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్న యావన్(23) అనే బీటెక్  థర్డ్ ఇయర్ చదువుతున్న యువకుడు . ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా, సీతాఫల్‌మండి ప్రాంతంలో ఉండే తన స్నేహితుడి ఇంట్లో ఉంటూ తరచూ యువతిని కలుస్తున్న యావన్.  దీంతో  గురువారం రాత్రి మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చి యావన్‌పై కత్తులతో దాడి చేసిన ఆరుగురు దుండగులు . వారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చినా వదలకుండా దారుణంగా నడిరోడ్డుపై  కత్తులతో పొడిచిన యువకులు.17 చోట్ల కత్తి పోట్లకు గురి కావడంతో అక్కడికక్కడే మృతి చెందిన యవన్ .యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. శుక్రవారం ఉదయం యువతి ఇంటి ముందు యవన్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ యువకుడు కుటుంబ సభ్యుల నిరసన చేశారు. ఈ కేసులో యువతి బావ తో పాటు సోదరుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

 

More articles

Latest article