24.1 C
Hyderabad
Monday, August 3, 2026

పాఠశాలల పని తీరుపై తనిఖీ బృంద సభ్యులతో సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల తనిఖీ బృందాలతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్, ఎఎంఓ బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుండి ఈ తనిఖీ బృందాలను మొదటి నుండే ప్రారంభించాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల పనితీరుపై తనిఖీ బృంద సభ్యులతో వివిధ అంశాలపై చర్చించారు. గత సంవత్సరం జరిగిన జిల్లా స్థాయి తనిఖీ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఉన్నటువంటి అంశాలను 10 బృందాల నోడల్ ఆఫీసర్ లతో, వివిధ విషయ నిపుణులతో కూలంకుషంగా చర్చించి వారు తెలియజేసిన సమాచారాన్ని సేకరించారు.

 

Meeting with inspection team members on the functioning of schools

 

వచ్చే విద్యా సంవత్సరం ఎక్కువ పాఠశాలలను తనిఖీ చేసే విధంగా ప్రణాళిక చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల 10 బృందాల సభ్యులు హాజరయ్యారు.

 

Meeting with inspection team members on the functioning of schools

More articles

Latest article