27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రోడ్డు పనులు పూర్తి చేయాలని ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ: బీర్కూర్ మండల కేంద్రంలో రోడ్డు పనులు నత్త నడకన కొనసాగుతున్నాయని, పనులను త్వరగా పూర్తి చేయాలని గ్రామస్తులు, యువకులు, ఆటో డ్రైవర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. రోడ్డుపై కంకర, కంకర డస్ట్, మొరం వేసి వదిలేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్మూధూళి కారణంగా దుకాణదారులు, ఆటో డ్రైవర్లు శ్వాసకోశ వ్యాధుల బారిన పాడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారన్నారు. రోజు కనీసం వాటర్ ట్యాంకర్ ద్వారా  ఐదుసార్లయినా  రోడ్డు పై నీళ్లు పట్టాలని డిమాండ్ చేశారు.

 

More articles

Latest article