27.5 C
Hyderabad
Friday, July 31, 2026

బీడీ టేకేదార్ల కమీషన్ రేటు పెరుగుదల

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

బీడీ టేకేదార్ల కమిషన్ రేటు బుధవారం నుంచి పెరగనున్నట్టు టీయుసిఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ తెలిపారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కమీషన్ ఏజెంట్లు గత 2 సంవత్సరాల క్రితం చేసుకున్న అగ్రిమెంటు మార్చి 31 న ముగిసింది. నూతన అగ్రిమెంట్ కోసం బుధవారం కామారెడ్డి లో గల పర్ణిక ప్యాలెస్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో బీడీ కమీషన్ ఏజెంట్ల సంఘానికి, బీడీ యాజమాన్యాల సంఘం మధ్య కమిషన్ రేటు పెంపు కోసం చర్చలు నిర్వహించారు. ఈ చర్చలలో ప్రస్తుతం వెయ్యి బీడీలకు ఇస్తున్న కమీషన్ రేటు రూ.22.60 పైసలు ఉండగా, దీనికి అదనంగా రూ.6 రూపాయలు ఇచ్చేలా అగ్రిమెంట్ జరిగిందన్నారు. ఇక నుండి వెయ్యి బీడీలకు రూ.28.60 పైసలు కమీషన్ రేటు ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. ఈ అగ్రిమెంట్ ఏప్రిల్ 1 నుండి మార్చి 31, 2028 వరకు అమలులో ఉంటుందన్నారు. ఈ చర్చలలో మన యూనియన్ తరపున చర్చలు జరపడానికి అధికారమివ్వబడిన తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టియుసిఐ) రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, తెలంగాణ బీడీ కమీషన్ దారుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బి. సాయినాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రతన్ పాలివాల్ టేకేదారుల యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.నర్సయ్య, బీడీ యజమానుల సంఘం (ది తెలంగాణ బీడీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్) అధ్యక్షులు హితేంద్ర ఉపాధ్యాయ, ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర గాంధీ, దేశాయి బీడీ ప్రొడక్షన్ మేనేజర్ రశ్మీ కాంత్ పటేల్, పికెటిపి బీడీ మేనేజర్ రమన్ బాయ్ పటేల్, శివాజీ బీడీ జనరల్ సూపర్ వైజర్ కల్పేష్ పటేల్, చార్ భాయ్ బీడీ హెచ్.ఆర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

Increase in commission rate for beedi takers

More articles

Latest article