29 C
Hyderabad
Monday, August 3, 2026

మెడికల్ అండ్ హెల్త్ వింగ్‌ నిజామాబాద్ డిసిసి చైర్మన్‌గా డాక్టర్ సృజిల్ బాబు 

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్, బతుకమ్మ:

కాంగ్రెస్ పార్టి అనుబంధ డాక్టర్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్‌కు నిజామాబాద్ జిల్లా డిసిసి చైర్మన్‌గా నగరంలొని ప్రముఖ  వర్ధన్ హాస్పిటల్ వైద్యులు, డాక్టర్ సృజిల్ బాబు  ను నియమించారు. బుధవారం హైదరాబాద్ లో గాంధీభవన్లో పీసీసీ  అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , డాక్టర్ సృజిల్ బాబుకు  నియామక పత్రాన్ని అందజేశారు.  ఈ సందర్భంగా డాక్టర్ డాక్టర్ సృజిల్ మాట్లాడుతూ.. టిపిసిసి అధ్యక్షుడు ,ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వాన్ని నిలబెట్టడానికి ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి  చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో డాక్టర్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్‌కు నిజామాబాద్ జిల్లా డిసిసి చైర్మన్‌గా నియమించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  టి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ, కాంగ్రెస్ పార్టీ నగర జనరల్ సెక్రటరీ ధర్మారం అవీన్, తెడ్డు బాబు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article