24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆత్మనిర్భర్ పంచాయత్ రాజ్ వర్క్‌ షాప్ నిర్వహణ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :

 

హైదరాబాద్‌లో “ఆత్మనిర్భర్ పంచాయత్ రాజ్” అంశంపై నిర్వహించిన ముఖ్యమైన వర్క్‌ షాప్‌కు కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ (ఐఏఎస్) అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, నందిపేట్ గ్రామ సర్పంచ్ ఎర్రం సిలండర్ లింగం పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధిని సాధించడానికి స్థానిక సంస్థల పాత్ర కీలకమని ఈ సందర్భంగా అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ వర్క్‌ షాప్ ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత బలపరిచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయి పాలనలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం పెంపొందించడమే కాకుండా, ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలందించే విధానాలను అభివృద్ధి చేయడానికి మార్గదర్శకత్వం లభించిందని పాల్గొన్న ప్రతినిధులు పేర్కొన్నారు.

 

Conducting self-reliant Panchayat Raj workshop

More articles

Latest article