24.7 C
Hyderabad
Monday, August 3, 2026

క్షయ రహిత గ్రామం కోసం కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

టీబి ముక్త భారత్ అభియాన్ లో భాగంగా క్షయ రహిత గ్రామం కోసం కృషి చేయాలని, ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది కలుగకుండా ఆరోగ్య సేవలను అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ అన్నారు. ముదక్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి లోని గుండారం పల్లె దవాఖాన ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న ఆరోగ్య సేవలను, హాజరు రిజిస్టర్ ను, స్టాకు రిజిస్టర్, ఈ డి డి క్యాలెండర్, గర్భిణీ స్త్రీల నమోదును పరిశీలించారు. అలాగే అత్యంత ప్రమాద లక్షణాలు గల గర్భిణీ స్త్రీల గుర్తింపు, ఈ నెలలో ఈడీడీ కలిగిన గర్భిణీ స్త్రీలు, జీవనశైలి వ్యాధులకు సంబంధించిన వివరాలు, హెచ్ పి వి వ్యాక్సిన్ కు అర్హులైన కిషోర బాలికలు ఎందరున్నారు, వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎందరున్నారో అడిగి తెలుసు కున్నారు. ఈ తనిఖీలో ఆసుపత్రి ఎంఎల్ హెచ్ పి డా.కవిత, ఆరోగ్య కార్యకర్త రఘు, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

More articles

Latest article