29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో 25% ఆర్థిక వాటా కేటాయించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మజ్దూర్ జనతా పార్టీ అధ్యక్షులు రాపెల్లి శ్రీనివాస్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్ నుండి 25% ఆర్థిక వాటా కేటాయించాలని మజ్దూర్ జనతా పార్టీ అధ్యక్షులు రాపెల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం 140 వ మే డే ఉత్సవాలను పురస్కరించుకొని నగరంలో కోట గల్లిలో మే డే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా గుజ్జ రాజేశ్వరి, రిటైల్ బట్టలు గుమాస్తా సంఘం అధ్యక్షులు జాడే సంతోష్, భారతీయ సంవిధాన్ ప్రచారక్ దళ్ రాష్ట్ర నాయకులు బత్తుల రవి, బీడీ టేకేదారుల రాష్ట్ర కార్యదర్శి రచ్చ ఆంజనేయులు, చరణ్ ఇంకా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికాగో నగరంలో అమరులైన కార్మికుల త్యాగఫలమే మే డే అని పేర్కొన్నారు. ఆనాటి నుండి సమాన పనికి సమాన వేతనం, 8 గంటల పని వేళలు అమలు లోకి వచ్చాయని పేర్కొన్నారు. అయితే మళ్ళీ కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 4 లేబర్ కోడ్ లను రద్దు చేసి తిరిగి 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కోటగల్లి గడ్డ నుండి బీడీ కార్మికుల జీవన భృతి కోసం అనేక ఉద్యమాలు చేసి ఎన్నికల్లో మేనిఫెస్టో లో పెట్టీ 4 లక్షల మంది కి బీడీ కార్మికుల కు జీవన భృతి సాధించడం జరిగిందని పేర్కొన్నారు. స్థానిక ఎంపీ అరవింద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా జిల్లా కు వచ్చినప్పుడు బీడీ కార్మికుల కోసం 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని హామీ ఇచ్చి విస్మరించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంగోల్ ఎల్లయ్య, నర్సయ్య, చరణ్, రాజ్ గణేష్, గజం శ్రీకాంత్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

25% financial share should be allocated in the central and state government budgets

More articles

Latest article