29 C
Hyderabad
Monday, August 3, 2026

ఉమ్మడి జిల్లాలో పలువురు మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పలువురు మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేశారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. నిజామాబాద్‌ జిల్లా మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న రవిబాబు నిర్మల్‌ జిల్లా మున్సిపల్‌ కమిషనర్‌గా నియామకమయ్యారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్‌ కమిషనర్‌గా పని చేస్తున్న శ్రీహరి రాజును ఆర్మూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. నారాయణఖేడ్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్న జగ్జీవన్‌ ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌గా నియామకమయ్యారు. శంషాబాద్‌ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా పని చేస్తున్న టి.పర్వతాలు కామారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌గా రానున్నారు. ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్న గజానంద్‌ భీమ్‌గల్‌ మున్సిపాలిటీ కమిషనర్‌గా నియామకమయ్యారు.

More articles

Latest article