27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన మనాల మోహన్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండల కేంద్రంలో గురువారం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి పలువురు ఆత్మీయ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురై మరణించిన బద్దం లింగారెడ్డి తండ్రి బద్దం గంగారెడ్డి మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి బద్దం లింగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అలాగే కల్లెడ పూరషోత్తం నానమ్మ ఇటీవలే మరణించడం తో వారి కుటుంబాన్ని కూడా మానాల పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మానాల వెంట నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ముత్యం రెడ్డి, బాల్కొండ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గున్నాల వెంకటేష్ గౌడ్, ఏర్గట్ల మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్, నాగేంద్ర నగర్ సర్పంచ్ సందే రంజిత్, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దొంచంద రవిరెడ్డి, అశ్వాక్ బాయ్, ఏర్గట్ల మండల మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ మునీర్, బట్టపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బలే శ్రీనివాస్, రఫీ, రోక్కెడ సంజీవ్, దొబ్బల మహేష్, జుంగల గణేష్, రాకేష్, నందు తదితరులు పాల్గొన్నారు.

 

Manala Mohan Reddy visits the affected families

More articles

Latest article