27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

జవహర్ నవోదయకు అడుగులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కలిగోట్ లో నూతన భవనం నిర్మాణ పనులు ప్రారంభం

 

. . . నవోదయకు 30 ఎకరాలను కేటాయించిన పంచాయతీ పాలకవర్గం

 

. . . ఎంపీ అర్వింద్ ధర్మపురి కృషి ఫలితంగా చక చకా పనులు

 

జక్రాన్ పల్లి, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా కలిగోట్ గ్రామంలో చారిత్రాత్మక ఘ‌ట్టం ఆవిష్కృతమైంది. జవహర్ నవోదయ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణానికి తొలి అడుగు పడింది. కలిగోట్ లో నవోదయ విద్యాలయ‌ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ఎంపీ  అర్వింద్ ధర్మపురి కృషి ఫలితంగా… గత సంవత్సరం మే నెలలో మోడీ ప్రభుత్వం ఈ విద్యాలయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా నూతనంగా 7 నవోదయ విద్యాలయాలు మంజూరు కాగా … ఏ పార్లమెంట్‌కూ దక్కని ఈ అరుదైన అవకాశం ఒక్క ఇందూర్ పార్లమెంట్‌కే దక్కింది. ఇందూర్ పరిధిలోనే రెండు నవోదయ విద్యాలయాలకు ఆమోదం లభించింది.

కలిగోట్ గ్రామం నిజామాబాద్ జిల్లాకు భౌగోళిక కేంద్రం కావడంతో… ప్రతి మూలకు చేరువలో ఉండేలా ఈ ప్రాంతాన్ని స్వయంగా ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎంచుకున్నారు. ఇతర నాయ‌కులు వేరే ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నాలు చేసిన నిజామాబాద్ పార్ల‌మెంట్ ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం క‌లిగోట్ లోనే న‌వోద‌య విద్యాల‌యం ఉండేలా కృషి చేశారు. అంతేకాకుండా  విద్యార్థులకు ఒక్క రోజు కూడా వృథా కాకుండా… గత విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు ఎంపీ అర్వింద్ ధర్మపురి . తాత్కాలిక భవనం మరమ్మతుల కోసం తన ఎంపీ నిధుల నుండి 20 లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయించారు.

 

Steps to Jawahar Navodaya
 

 

భవనం మాత్రమే కాదు… భూమి కూడా సురక్షితం చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి దృఢంగా నిర్ణయించారు. విద్యాలయం కోసం కేటాయించిన 30 ఎకరాల భూమిని వెంటనే నవోదయ విద్యాలయ సమితి పేరుపై బదలాయించాలని జిల్లా అధికారులను నిర్దేశించారు. ఎంపీ పిలుపుతో… కలిగోట్ గ్రామ పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించి విద్యార్థుల భవిత కోసం 30 ఎకరాలు అప్పగించారు. దీంతో ఇప్పుడు  వేల మంది విద్యార్థుల కలలకు పునాది పడుతోంది.

 

క‌లిగోట్ గ్రామంలో నవోదయ విద్యాలయం రావ‌డంతో ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఎంపీ అర్వింద్ ధ‌ర్మ‌పురి కి  గ్రామ పాల‌క‌వ‌ర్గంప్రజలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తూ… ఇందూర్ ను అభివృద్ధి వైపు న‌డిపిస్తున్న అర్వింద్ ధ‌ర్‌ఫపురి త‌మ ఎంపీగా ఉండ‌టం సంతోషంగా ఉండటున్నారు ప్రజలు.

More articles

Latest article