29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

36వ ఓపెన్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ లో జిల్లా ఉద్యోగులకు పథకాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ:

మలేషియా దేశంలో జరుగుతున్న 36వ ఓపెన్ మాస్టర్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో పాల్గోని నిజామాబాద్ విద్యుత్ ఉద్యోగులు పథకాలు సాధించారు. ఈ నెల  12 నుంచి 13 వరకు 2024 సంవత్సరంలో కౌలాలంపూర్ నగరంలో ఈ టోర్ని జరిగింది. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యుత్ ఉద్యోగులైన ఆశీలి గోపి , వాగమారే దినేష్ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి పథకాలు సాధించడం జరిగింది.Schemes for District Employees in 36th Open Master Athletics International Championship

 

అందులో వ్యక్తిగత ఈవెంట్లలో వాగమారే దినేష్ 35 ప్లస్ వయస్సు కేటగిరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి లాంగ్ జంప్ లో గోల్డ్ మెడల్, ట్రిపుల్ జంపులో వెండి పతకం సాధించాడు.  ఆశిలి గోపి 35 ప్లస్ వయస్సు కేటగిరిలో 110 మీటర్ల హర్డిల్ పరుగుపందెంలో వెండి పతకం, లాంగ్ జంపులో వెండి పతకం, ట్రిపుల్ జంపులో కాంస్య పథకం సాధించారు అలాగే 400 రన్నింగ్ రిలే లో పాకిస్తాన్ దేశ జట్టును ఓడించి రజత పతకం సాధించారు. జిల్లాకు చెందిన విద్యుత్ ఉద్యోగులు పతకాలు సాధించడం గర్వకారణం. వారికి విద్యుత్ అధికారులు, ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.

Schemes for District Employees in 36th Open Master Athletics International Championship

More articles

Latest article