. . . ఎత్తుండ విద్యుత్ ఉపకేంద్రం సాంకేతిక పరీక్ష పరిశీలన
బోధన్, బతుకమ్మ :
ఎత్తుండ ప్రాంత విద్యుత్ వినియోగదారులకు, వ్యవసాయదారులకు నాణ్యమైన విద్యుత్తును అందచేయడానికి అనుగుణంగా ఈ విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్ ఎస్ ఈ పివి రాజేశ్వర రావు అన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఎత్తుండ గ్రామం కోటగిరి మండలం బోధన్ డివిజన్ నూతనంగా నిర్మించిన ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి 33/11 కేవీ విద్యుత్ కేంద్రాన్ని గురువారం సాంకేతికంగా పరీక్ష చేసి, పరిశీలన చేశారు. సాంకేతికంగా ఎలాంటి అవాంతరాలు లేవని నిర్ధారించుకొని సాంకేతికంగా చార్జి చేశారు.

ఈ కార్యక్రమంలో డి ఈ ఆపరేషన్ బోధన్ మమ్మద్ ముక్తార్ డి ఈ ఎం ఆర్ టి కన్స్ట్రక్షన్ డి వెంకటరమణ ఏ డి ఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్ ఏడి ఈ ఆపరేషన్ నవీన్ రెడ్డి కన్స్ట్రక్షన్ బోధన్ సుమిత ఏ ఈ ఆపరేషన్ బుజ్జి బాబు ఏఈ ప్రొటెక్షన్ భవిత స్థానిక సీనియర్ లైన్స్పెక్టర్ శివప్రసాద్ ఎమ్మార్పీ స్థానిక విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

