నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నారాయణ స్కూల్ నిజామాబాద్ శాఖలో 10వ తరగతి ఫలితాలలో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సంవత్సరం పాఠశాల టాపర్‌గా గన్నారం శ్రీనిధి ( హాల్ టికెట్ నం.2605103083) 584 మార్కులు సాధించి మొదటి స్థానం పొందారు. అలాగే రెండవ స్థానం ఎరవేని దక్ష ( హాల్ టికెట్ నం.2605104525) 581 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఏజీఎం శివాజీ పటేల్ విద్యార్థులను అభినందిస్తూ, వారి కృషి, పట్టుదల, గురువుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ చందన విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నారాయణ స్కూల్ నిజామాబాద్ శాఖ 10వ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణతను నమోదు చేసిందన్నారు. విద్యార్థులందరూ విజయవంతంగా ఉత్తీర్ణులవడం పాఠశాల ఉన్నతమైన విద్యా ప్రమాణాలను మరోసారి నిరూపించిందన్నారు.

