25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజా ఉపయోగానికి ఇందూర్ లో స్థలాలు కరువు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అప్పుడు కలెక్టరేట్ శివారుకు తరలింపు

 

. . . ఇప్పుడు నిజామాబాద్ బస్టాండ్ కు స్థలం కరువు

 

. . . బస్టాండ్ ప్రతిపాధిత స్థలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

 

. . . నిజామాబాద్ డెవలప్ మెంట్ పట్టని రాజకీయ పార్టీలు

 

. . . సోషల్ మీడియాలో పోస్టులు వైరల్

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసి ప్రధాన బస్ స్టాండ్ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నిర్మాణంకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న పాత ఆర్టీసి బస్ స్టాండ్ ను ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రికి అప్పగించాల్సి ఉంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆనాడు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు అనుమతి ఇవ్వడానికి (ఆర్టీసి బస్ స్టాండ్ స్థలంను పార్కింగ్ గా ప్లాన్ లో చూపించేందుకు) అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అంగీకరించడంతోనే ఎంసిఐ పర్మిషన్ ఇచ్చింది. దానితో ఆనాటి నుంచి కొత్తగా బస్ స్టాండ్ నిర్మాణం ఎక్కడ అనే అంశం తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం హయాంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే (అప్పటి ఆర్టీసి చైర్మెన్) బాజిరెడ్డి గోవర్ధన్ రోడ్డు భవనాల శాఖ కార్యాలయాల కాంప్లెక్స్ లో (రైల్వే స్టేషన్ అనుకుని ఉన్న) నూతన బస్ స్టాండ్ నిర్మాణంకు ప్రతిపాదనలు చేశారు. ఆనాడు అర్ అండ్ బి ఎస్ఇ కార్యాలయం, మున్సిపల్ గెస్ట్ హౌజ్, అర్ అండ్ బి, ఇరిగేషన్ కార్యాలయాల కాంప్లెక్స్ లతో పాటు అవసరమైతే పోలీస్ పరేడ్ గ్రౌండ్ స్థలం సేకరించాలని ప్లాన్ చేశారు. అప్పటి సీఎం కేసిఆర్ కు బస్ స్టాండ్ నిర్మాణం ప్రతిపాదనలు ఇవ్వడంతో పాటు నిధులు కేటాయించాలని విన్నవించారు. ప్రభుత్వం మారడం, ప్రజా ప్రతినిధుల ఓటమితో అ అంశం మరుగున పడింది. ఇప్పుడు అదే బస్ స్టాండ్ ప్రతిపాదన స్థలంలో అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణంకు చక చకా పనులు జరుగుతుండటంతో బస్ స్టాండ్ కు ఇందూర్ కేంద్రంలో స్థలం కరువైంది. ఇటీవల కాలంలో అధికార పార్టీని ప్రతిపక్షాలు ప్రశ్నించకున్నా సోషల్ మీడియాలో మాత్రం ప్రశ్నించే పరిస్థతులు పెరిగాయి. వాట్సాప్, ఇన్స్టా గ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్ వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు.

 

There is a shortage of public spaces in Indore.

 

నిజామాబాద్ కు వందేళ్ల చరిత్ర ఉందని పుస్తకాలలో మాత్రమే చదువుకునే పరిస్థితి వస్తుందేమోనని సందేహలు వ్యక్తం అవుతున్నాయి. నిజాం కాలంలో ఒక వెలుగు వెలిగిన ఇందూర్ జిల్లా స్వాతంత్రం వచ్చిన తరువాత గాని, తెలంగాణ ఏర్పాటు తరువాత గాని అభివృద్ధికి నోచుకోకపొవడమే కారణం. ఒకప్పటి ఇందూర్ ఉమ్మడి జిల్లా కేంద్రంలో ప్రజా ఉపయోగానికి స్థలాలు కరువయ్యాయి. ఎందుకంటే నేతల స్వార్థ రాజకీయాలతో నిజామాబాద్ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. ఎన్నిసార్లు గద్దెలను ఎక్కేము(ప్రజా ప్రతినిధులుగా గెలిచాము), ఎంత వేనుకేసుకున్నామన్న యావ మినహ డెవలప్ మెంట్ పట్టకపోవడమే కారణం. నిజాం కాలం నాటి కట్టడాలు మినహా నిజామాబాద్ లో ఆధునిక హంగులతో నిర్మించిన ప్రజా ఉపయోగ భవనాలు కనిపించవు. పేరుకు రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత పెద్ద జిల్లాగా పేరుంది. కానీ పొరుగున కొంత గత ప్రభుత్వం హయంలో ఏర్పడిన రాజన్న సిరిసిల్లా జిల్లాతో కూడా డెవలప్ మెంట్ తో పోటిపడని పరిస్థితి నెలకొంది.

 

There is a shortage of public spaces in Indore.

 

రాష్ట్రంలో అతిపెద్ధ మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ గా (ఉమ్మడి రాష్ట్రంలో) ఏర్పడిన దానికి తగ్గట్టుగా నగర విస్థరణ లేదు, డెవలప్ మెంట్ కార్యక్రమాలు లేవు. అది చాలదన్నట్టు నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ ఆధార్టి అనే సంస్థ ఉంది. అది పాలకులకు కుర్చీల కోసం మినహ అది ఏర్పడిన తరువాత ఇందూర్ లో ఒక్కటంటే ఒక్కటి కుడా అభివృద్ధి పనులకు నోచుకోలేదు..  ఇందూర్ లో వందల కోట్లు ఖర్చు చేస్తున్న రెండు దశాబ్ధాలు గడిచిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అందుబాటులొకి రాలేదు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలో కేవలం నిజామాబాద్ కు నేటికి ఔటర్ రింగ్ రోడ్డు లేదు. ఇరవై ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న బైపాస్ రోడ్డుకు నాలుగు లైన్ల విస్థరణకు మోక్షం లేదు.  నిజామాబాద్ కు పట్టిన దరిద్రానికి పరాకాష్టగా మాస్టర్ పాన్ అని చెప్పాలి. దాదాపు యాబై ఏళ్ల క్రితం నాటి మాస్టర్ ప్లాన్ చివరిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మాస్టర్ ప్లాన్ కు రూ.2 కోట్ల వరకు ఖర్చైన అది మూసాయిదా (డ్రాప్ట్) ప్లాన్ కు పరిమితమైన అది అసెంబ్లి ఆమోదం పొందలేదు. దాదాపు 20 ఏళ్లకు పైగా నిర్మాణం జరుపుకున్న నిజామాబాద్ నగర పాలక సంస్థ నూతన (ఇరుకు) భవనం మినహ కొత్త భవనాలు కనిపించవు..

 

There is a shortage of public spaces in Indore.

 

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాలకులు ప్రధానంగా ప్రజా ప్రతినిధులు తమకు మైలేజీ ఇచ్చేవి, తమకు వ్యాపారపరంగా పనికొచ్చే ప్రాంతాలలో నూతన కార్యాలయాలను నిర్మిస్తారనే విమర్శలను మూటగట్టుకున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన పాత కలెక్టరేట్ లో స్థలం సరిపోదని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాత జిల్లా కలెక్టర్ కార్యాలయంను నిజామాబాద్ నగర శివారుకు తరలించారు.

 

There is a shortage of public spaces in Indore.

 

పాత కలెక్టరేట్ తో పాటు ఇరిగేషన్ కాలనీ వద్ద సేకరించిన ప్రభుత్వ స్థలంను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తారనే చర్చ జరిగింది. ప్రభుత్వం మారడంతో పాత కలెక్టరేట్ తో పాటు కెనాల్ కాలనీలో పిచ్చి మొక్కలు దర్శనం ఇస్తున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా అక్కడ కొత్త కలెక్టరేట్ ఏర్పాటు జరిగిన అభివృద్ధి ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇదిలా ఉండగా నిత్యం రెండున్నర లక్షల మంది ప్రయాణికులను తరలించే ప్రధాన ఆర్టిసీ బస్ స్టాండ్ (ప్రయాణ ప్రాంగణం) కు స్థలం కేటాయించడంలో పాలకులు నిర్లక్ష్యం కనపడుతుంది. తాజాగా నిజామాబాద్ ఆర్టీసి బస్ స్టాండ్ ను రైల్వే స్టేషన్ పక్కన కాకుండా బైపాస్ రోడ్డులోని స్టివేజ్ ట్రిట్ మెంట్ ప్లాంట్ (కొత్త కలెక్టరేట్) పక్కన నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్టు వినికిడి. ఇప్పటికే కొత్త కలెక్టరేట్ కు ప్రజలు వెళ్లడానికి అపసోపాలు పడుతున్నారు. నిజామాబాద్ నగర బొడ్డున ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఆర్టీసి బస్ స్టాండ్ ను నగర శివారుకు తరలిస్తే ప్రజలు ఆ ప్రయాణ ప్రాంగాణానికి వస్తారా అనే సంశయాలు వ్యక్తం అవుతున్నాయి.

 

More articles

Latest article