. . . డైరక్టర్ ఆఫ్ హెల్త్ డా.బి.రవీంద్ర నాయక్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
వైద్య ఉద్యోగులు అందరూ సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వహిస్తే ప్రజల వద్ద నుండి గౌరవం లభిస్తుందని డైరెక్టర్ డాక్టర్ బి.రవీంద్రనాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖకు చెందిన డైరెక్టర్ డాక్టర్ బి.రవీంద్రనాయక్ శనివారం జిల్లాకు వచ్చిన సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ ఘనంగా స్వాగతం పలికి తన ఛాంబర్ లో సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన జిల్లా ఉపా వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, జాతీయ క్షయ నియంత్రణ కార్యక్రమం, జాతీయ లెప్రసీ నియంత్రణ కార్యక్రమం, నేషనల్ క్వాలిటీ అస్సూరెన్స్, జీవనశైలి వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కుక్కకాటు, పాముకాటు మందులను అందుబాటులో ఉంచాలన్నారు. పీహెచ్ సీ అవసరాలకు అనుగుణంగా మందులను ఫార్మసిస్టులు ఈ ఔసిధిలో నమోదు చేయాలని తద్వారా మందులు సరఫరా అవుతాయన్నారు. డివిజన్ల వారీగా ఆరోగ్య కేంద్రాల జనాభా ఆధారంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రాల వారిగా నూతన పిహెచ్ సిలు, సిహెచ్ సిలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, మానవ వనరులు, బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మరమ్మతుల వివరాలు, మొదలగు అవసరాలను గుర్తించి ప్రణాళిక బద్ధంగా ప్రపోజల్స్ ని పంపితే ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిటిసి ఓ డా.దేవి నాగేశ్వరి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.అశోక్, జిల్లా ఉప వైద్యాధికారులు డా.రవీందర్, డా.సమత, డా.సికిందర్ నాయక్, పాలనాధికారి సుమంత్ కుమార్, ప్రోగ్రాం అధికారులు డా.వెంకన్న, డా.రాకేష్ , డా.వెంకటేష్, డా.సుప్రియ, డా.శిఖరా, డా.శ్రావ్య, ఓ ఎస్ డి శ్రీకాంత్, పీఎంఓ రూప, డి హెచ్ ఈ ఘనపూర్ వెంకటేశ్వర్లు, క్వాలిటీ మేనేజర్ రాము, డి ఎ వో సందీప్, డి ఈ ఐ సి మేనేజర్ సచిన్, నాగరాజు పాల్గొన్నారు.

