24.7 C
Hyderabad
Monday, August 3, 2026

టీ.యు పాలకమండలి సభ్యుడికి ఘన సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ యునివర్సిటీ పాలకమండలి సభ్యులుగా నియమించబడిన మహమ్మద్ ఘాజిని ఘనంగా సన్మానించారు. శనివారం జిల్లాకి విచ్చేసిన మహమ్మద్ ఘాజిని నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్, తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ కేతావత్ సురేఖ అమర్ సింగ్ లు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ కి పాలక మండలి సభ్యులుగా నియమించడం శుభ పరిణామమని, విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article